పులివెందుల
శ్రీ సూర్యప్రభ వాహనంపై దేవదేవుడు శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు రథసప్తమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు వరదా చార్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సూర్య ప్రభ వాహనంపై గ్రామోత్సవా న్ని నిర్వహించారు .పూల అంగళ్ళ సమీపంలో సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకగానే పట్టణంలోని పురవీధులు గోవింద నామ స్మరణతో మార్మోగాయి సూర్యప్రభ వాహనంపై ఉండే దేవదేవుని ప్రత్యక్ష చూసిన భక్తకోటికి శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయని ఆలయ అర్చకులు వరదాచార్యులు తెలిపారు.