ఒంటిమిట్ట :
ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఏకశిలపై వెలసిన సీతారామ లక్ష్మణ మూర్తులకు టిటిడి అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యులు, మనోజ్ కుమారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఒంటిమిట్ట గ్రామంలోని మాడవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారికి కాయ కర్పూరాలు సమర్పించి స్వామి వారి దీవెనలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, విజిలెన్స్ ఆఫీసర్ గంగులయ్య, సూపర్డెంట్ హనుమంతయ్య, ఆలయ అర్చకులు, టిటిడి సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.