ఆదివాసి సంక్షేమ పరిషత్, ఆదివాసి టీచర్స్ అసోసియేషన్
బుట్టాయగూడెం:
కె.ఆర్.పురం, యువత శిక్షణ కేంద్రంలో 2024 డీఎస్సీ శిక్షణ పొందుతున్న ఆదివాసీ అభ్యర్థులకు వసతి సౌకర్యం కల్పించాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ కోరారు. ఈ మేరకు ఆదివాసీ టీచర్ అసోసియేషన్(ఎటిఎ)రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కొమరం వెంకటేశ్వరరావు కె.ఆర్.పురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎం. సూర్యతేజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు మాట్లాడుతూ సుదూర, మారు మూల ప్రాంతం నుండి ఐటీడీఏ యువత శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ప్రయాసతో కూడిన పని అని దీని వల్ల చాలా మంది అభ్యర్థులు శిక్షణ పొందుటకు ఆసక్తి చూపించుటలేదని తెలిపారు. ఈ కారణంగా ఆదివాసీ విద్యార్థులు నష్ట పోతున్నరని ఆవేదన వ్యక్తంచేశారు.కాబట్టి ఐటీడీఏ యువత శిక్షణ కేంద్రంలో శిక్షణ తో పాటు వసతి సౌకర్యం కల్పించాలని ఐటీడీఏ అధికారిని కోరినట్లు తెలిపారు. సమస్యపై సానుకూలంగా స్పందించిన ప్రాజెక్ట్ అధికారి ఎం.సూర్యతేజ దూర ప్రాంత విద్యార్థులకు కోచింగ్ తో పాటు వసతి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సోదెం మల్లయ్య , ఎ ఎస్ పి జిల్లా నాయకులు సోదెం ముక్కయ్య, డివిజన్ కార్యదర్శి తెల్లం లక్ష్మణ్ రావు, బుట్టాయగూడెం మండల అధ్యక్షుడు రవ్వా బసవరాజు,మండల కార్యవర్గ సభ్యులు ఇరపా రాంబాబు, తెల్లం శేఖర్, జీలుగుమిల్లి మండల ప్రధాన కార్యదర్శి పూనెం వెంకటేశ్వరరావు, జీలుగుమిల్లి మండల కార్య వర్గ సభ్యులు కొరస తులసిరావు, గోవిందరావు నాగేంద్ర కుమార్ మరియు ఆదివాసీ విద్యార్థులు పాల్గొన్నారు.