మార్కాపురం.
రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీ కొప్పరపు వెంకట కృష్ణ నిలయం సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం జరిగింది.
కార్యక్రమాన్ని సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఐ బాల సుబ్బారావు, సెక్రటరీ గుంటక సుబ్బారెడ్డి లు టెంకాయ కొట్టి అన్న ప్రసాదాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు శాసనాల వీరబ్రహ్మం, జాయింట్ సెక్రెటరీ ఎం మోహన్ రెడ్డి, కోశాధికారి పి. మల్లికార్జునరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పఠాన్ హుస్సేన్ ఖాన్, గుంటక వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.