మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
రాప్తాడు;
రఘువీరా రెడ్డి ఒక పొలిటికల్ బ్రోకర్ అని
పుట్టపర్తి సాయిబాబా చనిపోతే అయన పార్థివ దేహాన్ని తేలకుండా డబ్బులు మూటలు సద్దుకున్న వ్యక్తి రఘువీరా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రాప్తాడు వద్ద సిద్ధం సభా ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరా రెడ్డి లాంటి ముఠాలు కాంగ్రెస్ లో చాలా ఉన్నాయి.
రాజశేఖర్ రెడ్డి గారికి మడుగులు వత్తీ, అయన చనిపోయాక శ్రీ వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు.
మా ఇంచార్జీ మంత్రిగా ఉండి, కనీసం నా నియోజకవర్గం లో కూడా పర్యటించలేదు, ఆయనకి నా గురించి ఏమీ తెలుస్తుంది.
నేను కునీలు చేశాను అని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పకుంటా
కాంగ్రెస్ పార్టీని నేను బ్రతికించా, కాంగ్రెస్ ను చంపింది కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరాలే,
లక్షల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు ఒక్క చెప్పుకోదగ్గ పథకం ఏమైనా పెట్టారా?
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నేను ఇది చేశాను అని చెప్పుకునే దిక్కు చంద్రబాబు కు లేదు. ముందు చంద్రబాబును కుప్పం లో గెలవమని చెప్పండి అని
ఈసీ కి నా పై ఫిర్యాదు చేయడం వల్ల నాకేం నష్టం లేదు అని పేర్కొన్నారు.