హిందూపురం టౌన్
ప్రతి ఒక్కరూ తమ తమ రంగాల్లో నైపుణ్యత కనబరిచి వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆటల్ ఇంక్యుబేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ చంద్రమౌళి, మెంటర్ డాక్టర్ జ్యోతి, షహీన్లు అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్జీఎస్ ఎంబీఏ కళాశాలలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ సౌజన్యంతో ప్రిన్సిపల్ డాక్టర్ నాగేంద్ర కుమార్ అధ్యక్షతన ఒక్క రోజు మేనేజ్ మెంట్ కామర్స్ విద్యార్ధులకు యాన్ అవేర్నెస్ వర్క్ షాప్ ఆన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రై రైస్యూర్షిప్’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉపాధి కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా ఇతరులకు ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధి చెంది రాబోయే తరాల వారికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రీసెర్చ్, సీడ్ క్యాపిటల్, ఉత్పాదకత, మార్కెటింగ్, వ్యాపార భాగస్వామ్యంపై శిక్షణ ఇచ్చి స్టార్టప్స్ అభివృద్ధికి అన్ని అంశాలలో భారత ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అనంతరం వ్యాపారంలో అవసరమైన మెళకువలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సదసుల్లో కళాశాల అధ్యక్షులు రేవూరు చంద్రమోహన్, కార్యదర్శి బైసాని రాంప్రసాద్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.