Tuesday, May 6, 2025

Creating liberating content

తాజా వార్తలునేటి నుండి కోడి రంగనాథ స్వామి వార్షిక ఉత్సవాలు ప్రారంభం

నేటి నుండి కోడి రంగనాథ స్వామి వార్షిక ఉత్సవాలు ప్రారంభం

లేపాక్షి : మండల పరిధిలోని సిరి వరంలో వెలసిన కోడి రంగనాథ స్వామి వార్షిక ఉత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ నెల 17నుండి ప్రారంభమవుతున్నాయి. శనివారం ఉదయం ఆలయంలో కలశ స్థాపన పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం మహా మంగళహారతి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం సిరివరం గ్రామ మహిళలు ఉపవాస దీక్షతో దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు.సాయంత్రం 6 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, అనంతరం ప్రాకారోత్సవం జరుగుతుంది. ఆదివారం ఉదయం 11 -30 గంటలకు కోడి రంగనాథ స్వామి ఆ బ్రహ్మ రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. సోమవారం ఉదయం 10:30 గంటలకు సత్యనారాయణ స్వామి పూజ, రాత్రి 7:30 గంటలకు ముత్యాల పల్లకి ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ట్రస్ట్ చైర్మన్ రామచంద్రరావు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article