Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుఅంబేద్కర్ విగ్రహ నిర్మాణ విషయంలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ విషయంలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

పులివెందుల
వాస్తవాలను వక్రీకరించి అంబేద్కర్ విగ్రహంపై అవాస్తవాలు దుష్ర్పచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ కౌన్సిలర్లు, వైకాపా నాయకులతో కలిసి పులివెందుల అర్బన్ సి ఐ శంకర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ పులివెందుల సుందరీకరణ లో భాగంగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణం విషయంలో టీడీపీ వారు ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్ వారు చేసిన ప్రచారాన్ని ఖండిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలి అని వినతిపత్రం ఇవ్వడం జరిగింద న్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు పులివెందుల అభివృద్ధిని చూడలేక ప్రజలలో అపోహలు పెంచేం దుకు నాటకాలు ఆడుతున్నారన్నారు అపోహలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో జే సి యస్ ఇంఛార్జి లు పార్నపల్లి కిషోర్, డేరంగుల చంద్రమౌళి,కో ఆప్షన్ మెంబర్ చంద్రమౌళి, నాయ కులు డానియల్,కృష్ణ మూర్తి,ప్రశాంత్, సంపత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article