పులివెందుల
పులివెందుల పట్టణంలోని 23వ వార్డు అంకాలమ్మ పేట సచివాలయ పరిధిలో చేయూత ఫ్రీ లాంచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జెసిఎస్ కన్వీనర్ చంద్రమౌళి, కౌన్సిలర్లు కొండలరావు, లక్ష్మీ భార్గవి, లక్ష్మీ ప్రసన్న లు ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 16వ తేదీన చిత్తూరులో చేయూతకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనారిటీ, 45 సంవత్సరాలు నిండిన మహిళలకు 18,500 డబ్బులు వారి ఖాతాలలో జమ చేయడం జరుగు తుందన్నారు. అర్హులైన వారందరికీ చేయూత ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి వారికి అవగా హన కలిగించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమం లో దశరథ రామిరెడ్డి ఖాదర్ భాష , సంపత్ , రమేష్ ,కేశవ మెప్మా సిబ్బంది, డ్వాక్రా మహిళలు, సచివాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.