విరేచనాలు వాంతులతో పలువురు విద్యార్థులు 57 మంది విద్యార్థులకు అస్వస్థత 8 మందిని ఏరియా ఆస్పత్రికి తరలింపు. అప్రమత్తమైన యంత్రాంగం అదుపులో పరిస్థితి. ఆసుపత్రిలో విద్యార్థులకు పలువులు ప్రముఖులు పరామర్శ్ ఆదివారం మెనో తోనే అస్వస్థతకు కారణం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆదివారపుపేటలో ఘటన
రామచంద్రపురం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం ఆదివారపుపేటలో గల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అవడంతో పలువురు విద్యార్థులు విరేచనాలు, వాంతులతో పరిస్థితి కలకలం రేపింది. దీంతో విషయం తెలిసిన అధికార యంత్రాంగం అప్రమత్తం మవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే రామచంద్రపురం మండలం ఆదివారపుపేటలో గురుకుల పాఠశాల ఉంది ఇక్కడున్న పలువురు విద్యార్థులు పుడ్ పాయిజన్ తో సోమవారం అసౌకర్యానికి గురయ్యారు. అఖస్మికంగా మరికొందరు వాంతులు, విరేచనాలుతో ఉక్కిరిబిక్కిరవ్వడంతో ఒక్కసారిగా కలకలం రేగి పరిస్థితి తెలిసిన రామచంద్రపురం తహసిల్దార్ ఎం .వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది, వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు.వారిలో 8 మందికి విరేచనాలు ,వాంతులు అవడంతో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ బి.వీరబద్రండు తెలిపారు. సమాచారం తెలుసుకున్న డీఎం అండ్ హెచ్ ఓ హుటాహుటిన గురుకుల పాఠశాలకు వెళ్ళి పర్యవేక్షించారు.సుమారు 57 మంది విద్యార్థులకు అస్వస్థత కలగడంతో
ఏరియా ఆసుపత్రి లో ఎనిమిది మంఈ విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.అందరి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యాధికారులు తెలపడంతోఅందరూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే దీనికి గల కారణం ఆదివారం కావడంతో విద్యార్థులు చికెన్ బిర్యానీ చెయించడతో అది కాస్తా వికటించి విద్యార్థుల అస్వస్థతకు కారణమైనట్లు పుడ్ తిన్న విద్యార్థులు సైతం చెబుతున్నారు.ఈకారణంగానేఇలా జరిగిందని తెలుస్తోంది.
విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవలను పర్యవేక్షించిన జిల్లా వైద్యాధికారులు,రెవిన్యూ అధికారులుతోపాటు
ఏరియా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విద్యార్థులను రామచంద్రపురం నియోజకవర్గ వైసిపీ ఇంచార్జి పిల్లి సూర్య ప్రకాష్,జనసేన ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, టీడీపీ ఇంచార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం,నియోజకవర్గ మైనార్టీ బీసి సంఘ అద్యక్షులు యాట్ల నాగేశ్వరరావు, పలువురు జనసేన, వైసీపీ, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు ఏరియా ఆసుపత్రికి వెళ్ళి విద్యార్థులపరిస్థితి అడిగి తెలుసుకున్నారు.