తుని:తాము ఇచ్చిన హామీలను నెరవేర్చామని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తుని మండలం తిమ్మాపురంలో మంత్రి దాడిశెట్టి రాజా పర్యటించారు. ఈ నాలుగున్నర ఏళ్ళల్లో అమలపర్చిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలుపరచిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. విపక్షాల ఆరోపణ తిప్పికొట్టిన మంత్రి రాజా అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొప్పన రాము, పోతల రమణ, పోలిశెట్టి సోమరాజు, పురుషోత్తమ గంగాభవాని, సర్పంచ్ అత్తి వరలక్ష్మి, ఎంపీటీసీ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు