సొసైటీ కార్యదర్శి శర్మ చేతులు మీదుగా మెంబర్ షిప్ కార్డు దృవీకరణపత్రం ప్రదానం తొగరు మూర్తి కి పలువురు అభినందనలు.
రామచంద్రపురం
సమాజ హిత సేవలకు గుర్తింపు గా రామచంద్రపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు తొగరమూర్తికి
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్ గా అవకాశం దక్కింది. దీంతో
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్ గా నియమించినట్లు తొగరుమూర్తిని నియమించారు. ఈమేరకు ఆదివారం రామచంద్రపురం పట్టణంలో తొగరుమూర్తి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి విషయాన్ని తెలియజేసారు. ఈసందర్భంగా మూర్తి మాట్లాడుతూ తనకు దక్కిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్ షిప్ కార్డ్ తోపాటు దృవీకరణపత్రం సొసైటీ సెక్రటరీ డాక్టర్ పి.ఎస్.శర్మ చేతులమీదుగా అందజేసారని తెలిపారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ రక్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిట్ వుండి ఆర్థిక ఇబ్బందుల వల్లూ చదువుకోలేని ఎంతోమంది యువతీ యువకులకు ఆర్ధికంగా అండగా నిలిచి చదివించానని,వందలాది మంది విద్యార్థిని విద్యార్థులకు సైతం వారి భవిష్యత్తుకు ఉపయోగపడే పలు రకాల అనేక పుస్తకాలనుః అందజేశానని ,ఇలా అనేక సమాజ హిత కార్యక్రమాలు చేస్తూ బ్లడ్ డోనర్స క్లబ్ ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజవర్గంలో 1989 నుంచి నేటి వరకు గర్భిణీ స్త్రీలకు,రోగులకు, ప్రభుత్వ , ప్రైవేట్ హాస్పిటల్లో వారి అవసరాలకు అనగుణంగా ఆపరేషన్ సమయంలో రక్తం కావాలి అని డాక్టర్లు పిలుపునిచ్చిన సమయంలో తానే పలుమార్లు స్వచ్ఛందంగా రక్తాన్ని అందించి వంద లాదిమంది తల్లులను బిడ్డలను కాపాడగలిగానని మూర్తి తెలిపారు.అలాగే 22 నేత్రాలను హైదరాబాద్ ఎల్ .వి. ప్రసాద్ ఐ బ్యాంకు కు,కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ కి,నిడదవోలు డేవిడ్ ఐ బ్యాంక్ కి పంపానట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పటల్ అభివృద్ధి కమిటీ సభ్యుడిగా పేదలకు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నానని ఈసందర్భంగా తెలిపారు. వందలాదిమంది నిరుపేద కుటుంబాలకు అనేక సేవా కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 2001 నుంచి కాలేజీలు,హై స్కూల్స్ లలో,శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు వ క్రీడా ప్రాంగణంలో విద్యార్థిని విద్యార్థులకు చైతన్య ఉచిత యోగా శిక్షణా సంస్థ గురువుగా సూర్య నమస్కారములు,యోగా ఆసనాలు ఉచితంగా నేర్పుతూ దేశ సంస్కృతి సంప్రదాయాలు గురించి తెలియజేస్తున్నానని తెలిపారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా జిల్లాకలెక్టర్ ఉంటారని తెలుపుతూ రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్ గా తానం సమాజంలోని పేదవారికి,ఆపదలో ఉన్నవారికి మరింత సేవ చేసుకునే అవకాశం కలిగిందని ఈసందర్భంగా సంతోసం వ్యక్తం చేశారు. నా సేవలను గుర్తించి లైఫ్ మెంబర్ గా నన్ను తీసుకున్నందుకు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులకు మూర్తి ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు.ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమాజ సేవకులను,మానవతావాదులను, మేధావులను రెడ్ క్రాస్ సంస్థలో సభ్యులుగా జాయిన్ చేస్తానని తెలియజేశారు.కాగా విషయం తెలసిన సందర్భంగా డాక్టర్ లయన్ జి వి రావు,ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ వీరభద్రుడు ,శ్రీ సత్యమూర్తి ఫౌండేషన్ అధక్షులు తాడాల సత్యనారాయణ, గుబ్బల శ్రీనివాస్, అబ్బాయి రెడ్డి, చుండ్రు వెంకట్రావు చౌదరి డాక్టర్ సునీత డాక్టర్ చక్రధర్ డాక్టర్ మోహన్ తదితరులు తొగరు మూర్తిని ఈసందర్భంగా అభినందించారు