తాజా వార్తలువేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు...ద‌ర్శ‌నానికి 6గంట‌ల స‌మ‌యం…

వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు…ద‌ర్శ‌నానికి 6గంట‌ల స‌మ‌యం…

వేములవాడ రాజ‌న్న‌క్షేత్రం భ‌క్తులతో కిట‌కిట‌లాడుతోంది. ఉద‌యం నుంచే రాజ‌న్న‌ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు భారీగా చేరుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలు అధికారులు రద్దు చేశారు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.సమ్మక్క-సారలమ్మ జాతరలకు వెళ్లే ముందు… మొదటగా వేములవాడ రాజన్న క్షేత్రానికి రావడం ఆనవాయితీ. స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు ఆదివార‌మే రాత్రికి భ‌క్తులు క్షేత్రానికి చేరుకొని సోమ‌వారం ఉద‌యం స్నానాలు ఆచ‌రించి ఆల‌యానికి చేరుకున్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article