భారీ ఎత్తున హర్యాన మద్యం స్వాధీనం 5.50 లక్షల విలువైన మద్యం, 2 వాహనాలు స్వాధీనం, కడప అడిషనల్ ఎస్పీ లోసారి. సుధాకర్
కడప బ్యూరో
కడప జిల్లా పోలీసులు అక్రమ మద్యంపై మరోసారి పంజా విసిరారు. భారీ మొత్తంలో హర్యానా రాష్ట్రానికి చెందిన మధ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది…. జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ లోసారి.సుధాకర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు పులివెందుల డిఎస్పి ఆదేశాలతో పులివెందుల శంకర్ రెడ్డి ,ఎస్సై అరుణ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి, స్పెషల్ బ్రాంచి సిబ్బంది కదిరి- పులివెందుల రోడ్ లోని కనంపల్లి గ్రామం వద్ద గల చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా కదిరి వైపు నుండి ఒక బొలెరో వాహనము ఒక ఐచ్చర్ వాహనములు రాగా వాటిని ఆపి తనిఖీ చేసి, చూడగా సదరు లగేజి వాహనంలలో ఎలాంటి లైసెన్స్ అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున హర్యాన రాష్ట్రముకు చెందిన మద్యంను రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు, అక్రమ రవాణా చేస్తున్న ఎడుగురిని అదుపులోనికి తీసుకొని వారి నుండి ఒక బొలెరో వాహనము ఒక ఐచ్చర్ వాహనము సుమారు రూ. 5,50,000 లు విలువ చేసే 750 ఎంఎల్ పరిమాణము గల 390 బాటిళ్ళను, 180 ఎం ఎల్ గల 575 బాటిళ్ళను స్వాధీన పరుచు కోవడము జరిగిందని తెలిపారు, అరెస్ట్ అయిన వారిలో పులివెందుల బ్రాహ్మణ పల్లె చెందిన
రాగిపాటి మహబూబ్ బాష,
లింగాల మండలం అంబకపల్లి గ్రామం చెందిన బండి శ్రీనాథ్ రెడ్డి, పులివెందుల మారుతి హాల్ వీధికి చెందిన
చావిడి నాగరాజు,
పులివెందుల ఎస్బిఐ కాలనీ చెందిన షేక్ సుభాన్, పెండ్లిమర్రి బాలయ్య గారి పల్లెకు చెందిన మాచిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి, పులివెందుల ఎర్రగుడి పాలెం చెందిన
కంభటి హరి కృష్ణ,
వేముల మండలం వేల్పుల గ్రామం చెందిన బండి ఓబుల్ రెడ్డి లు ఉన్నట్లు తెలిపారు, స్వాధీనం చేసుకున్న వాటిల్లో మద్యంతోపాటు 6 లక్షల విలువైన బొలెరో వాహనం,
10 లక్షల విలువైన ఒక ఐచర్ వాహనం10 ఖాళీ అరటి కాయల బాక్సులు కూడా ఉన్నట్లు తెలిపారు.
అక్రమమద్యాన్ని అడ్డుకొనుటలో కృషి చేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్టు అడిషనల్ ఎస్పి తెలిపారు.