టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరి ప్రసాద్
కడప అర్బన్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతల అరాచకాలను వ్యతిరేకిస్తూ, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం పూరించారని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ పేర్కొన్నారు. హరి టవర్స్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువ గళం పాదయాత్రలో పర్యటించని నియోజకవర్గాల్లో శంఖారావం ద్వారా లోకేష్ పర్యటించి, రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించి,జగన్ రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రజలకు, కార్యకర్తలకు తెలియపరుస్తారని చెప్పారు. 50 రోజుల్లో 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని, ఒకరోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంఖారావం కార్యక్రమం నిర్వహించడం, ప్రజల సమస్యలను ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా నోట్ చేస్తారని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వివరిస్తూ, ప్రతి ఇంటికి చేరు వవుతారన్నారు. వైసిపి నేతల అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా 220 రోజులు, 3 వేల 132 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి, ఈ ప్రభుత్వంలో బాధితులుగా మారిన అన్ని వర్గాల ప్రజలకు లోకేష్ భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. శంఖారావంలో కార్యకర్తలు నేరుగా లోకేష్ తో వారి అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్లో వైసిపి నాయకులు టిడిపి కార్యకర్త ను కొట్టడం, శ్రీనివాసరెడ్డిని దూషించడాన్ని ఆయన ఖండించారు. ఈ సమావేశంలో నాగరాజు, గంధం ప్రసాద్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.