హిందూపురం టౌన్
హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్వర్థిగా పోటీ చేయడానికి తనకు అవకాశం కల్పించాలని శుక్రవారం ఎపి కాంగ్రెస్ కార్యాలయంలో అమానుల్లా తన బయోడేటాను అందించారు. ఈ సం దర్భంగా పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీ అభివృద్ది కోసం తాను పాటుబడుతున్నట్లు తెలిపారు. గతంలో చాలా సార్లు అవకాశం కల్పించాలని కోరడం జరిగిందని , అయితే ఇప్పటి వరకు అవకాశం కల్పించ లేద న్నారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. బయోడేటాను తీసుకున్న పార్టీ కార్యాలయం సిబ్బంది ఏపి పిసిసి అధ్యక్షురాలు షర్మిల దృష్టికి తీసుకెళ్లి బయోడేటాను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం కాంగ్రెన్ నాయకులు ఎన్ జమీల్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఫయాజ్, జిల్లా మైనార్టీ వైన్ ప్రెసిడెంట్ మహబూబ్ బాషా, నియోజకవర్గ మైనార్టీ ప్రెసిడెంట్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు