ముదిగుబ్బ
ముదిగుబ్బ మండల పరిధిలోని రాళ్లఅనంతపురం సమీపాన శుక్రవారం 407 వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈసంఘటనలో డ్రైవర్ నరసింహులు(30) మృతి చెందాడు. నంబులపూలకుంట మండలంలోని మండెంవారిపల్లికి చెందిన డ్రైవర్ నరసింహులు బత్తలపల్లి వైపునుండి కదిరివైపు వస్తూ రాళ్లఅనంతపురం వద్ద జాతీయరహదారిపై వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొని 407 వాహనం బోల్తాపడింది. వాహనంలోనే డ్రైవర్ మృతి చెందిన సంఘటన తెలుసుకొన్న ముదిగుబ్బ సీఐ యతేంద్ర సిబ్బంది నరేష్, ఇస్మాయిల్ తోవెళ్లి మృతిదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరికి తరలించి రాకపోకలను క్రమబద్ధీకరించారు.