వేంపల్లె
స్థానిక పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాతా ప్రాకారోత్సవం నిర్వహించామని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు దొంతు సుబ్బారావు,పచ్చిపులుసు మురళీకిషోర్,తోటoశెట్టి శెట్టి చంద్రశేఖర్,శ్రీ వాసవి కల్యాణ మండపం అధ్యక్షుడు కామిశెట్టి సతీష్, ఆలయ నిర్వాహకులు మిట్టా మోహన్ రావు, కామిశెట్టి ప్రవీణ్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.