నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ తెల్లం రాజ్యలక్ష్మి
బుట్టాయిగూడెం.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ప్రజారోగ్యానికి శ్రీరామరక్ష అని పోలవరం నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ బెల్లం రాజ్యలక్ష్మి అన్నారు. మండలంలోని దొరమామిడి సచివాలయం పరిధి తెల్లవారిగూడెం లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందిస్తున్నారని తెలిపారు. ప్రతి సచివాలయం పరిధిలో హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువలో అందించాలని దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు, ఆరోగ్యశ్రీలో 25 లక్షలు పొందు పరిచిన ఘనత ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కిందని అన్నారు. ఆనాడు వై యస్ రాజశేఖర్ రెడ్డి వైద్యం, ప్రజల అర్యోగం పట్ల ఒక్క అడుగు ముందుకు వేస్తే,నేడు జగన్ మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకు వేసి చరిత్రకెక్కారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం శాంతి రమణ, స్థానిక సర్పంచ్ తెల్లం రాముడు, స్థానిక వైస్సార్సీపీ నాయకులు,అధికారులు, సచివాలయం సిబ్బంది, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.