బుట్టాయగూడెం.
ఎరువుల దుకాణాల నిర్వహణపై అధికారులు చేసిన తనిఖీలలో పలు అవకతవకలు బయటపడ్డాయి. మండలంలోని పలు ఎరువుల దుకాణాలను, దుకాణాల లైసెన్సులను శుక్రవారం నూజివీడు ఎడి(అగ్రికల్చర్) జి.విద్యాసాగర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల వ్యాపారం నిర్వహించే ప్రైవేట్ డీలర్స్ దుకాణాలను స్క్వాడ్ తనిఖీ నిర్వహించి దుకాణాల లైసెన్సులను, జిఎస్టి కాపీలను మరియు ఎరువులు సరఫరా చేసే కంపెనీల ఓ ఫారంలను పరిశీలించారు. ఈపాస్ మిషన్లో ఎరువుల స్టాక్, దస్త్రాలు, గొడవల్లో ఎరువుల లభ్యత క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విషయాలలో వ్యత్యాసం ఉన్న దుకాణాల వద్ద ఎరువుల అమ్మకాని నిలుపు చేయాలని ఆదేశించారు. నిలుపుదల చేసిన ఎరువుల విలువ రూ.87870 గా తెలిపారు. వీరి వెంట మండల వ్యవసాయ అధికారిణి బి.సుమలత ఉన్నారు.