బుర్రాను బుజ్జగించినా గుర్రుగా ఉన్నారా
కదిరి కనుసైగతో ఖతం చేస్తారా
చింతలచెరువు అంతాతానై బరువంతా భరిస్తారా
దూసుకుపోతున్న దద్దాల ఆరు మండలాల్లో అపూర్వ స్వాగతం
హనుమంతునిపాడు
కనిగిరిలో వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. వైసీపీ ఇంచార్జ్ గా డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ను అధిష్టానం ప్రకటించిన నాటినుండి టికెట్ రేసులో ఉన్న ప్రధాన నాయకులు శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావు రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచేరువు సత్యనారాయణ రెడ్డి ఇంచార్జ్ వెళుతున్న కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వీరు ఎవ్వరు ఇంచార్జ్ దద్దాల వెంట కనిపించక పోవటం నియోజకవర్గంలో చర్చానీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న కదిరి అభిమానులు శీలంవారి పల్లిలో సమావేశం అయిన సందర్భంగా మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావు మాట్లాడుతూ దద్దాల నారాయణ యాదవ్ ఇంచార్జ్ మాత్రమే అభ్యర్థి కాదు అని చెప్పటంతో ఒక్కసారిగా వైసీపీలో అలజడి మొదలయినట్లు సమాచారం తెలుస్తుంది. మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావుకు కనిగిరి నియోజకవర్గ పరిధిలోని చంద్రశేఖర పురం పామూరు మండలాల్లో మంచి పట్టుంది. కనిగిరి టౌన్ లో గణనీయంగా కదిరికి ఓటు బ్యాంక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక అంగబలాల తోపాటు సౌమ్యునిగా స్నేహశీలిగా వివాదరహితునిగా మంచిపెరున్న కదిరిని ఇంచార్జ్ గా అధిష్టానం ప్రకటించక పోవటం కదిరి అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ సందర్భంగా కదిరి అభిమానులు సమావేశమై ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కదిరిపై ఒత్తిడి తేగా తొందరపడి పార్టీ మారవద్దని పదిరోజులు వేచిచూడాలని మాజీ శాసనసభ్యులు తన అభిమానులకు నచ్చ జెప్పారు. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావటంతో కనిగిరిలో కదిరి కనుసైగతో వైసీపీని ఖతం చేస్తారా అనే చర్చ జోరందుకుంది. స్థానిక శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఇప్పటి వరకు ఇంచార్జ్ దద్దాలతో కలిసిన సందర్భం లేదు. వైస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో కలిసి పాల్గొంటారని ప్రచారం జరిగినప్పటికీ ఎక్కడా కనిపించలేదు. అధిష్టానం బుజ్జగించి అమరావతిలో మీడియా సమావేశంలో ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్ కు సహకరిస్తానని చెప్పినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన లేకుండా ఇంచార్జ్ తో చేయించటం బుర్రా అభిమానులకు పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది. వైసీపీ ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలిగాని ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనటమేమిటని బాహాటంగానే విమర్శిస్తున్నారు. శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ కనిగిరి అభివృద్ధి కోసమే పరితపిస్తున్నారని కనిగిరిని రెవెన్యూ డివిజన్ గా మార్చారని ప్రభుత్వ వైద్యశాలను 100 పడకల ఆసుపత్రిగా మార్చుటకు వైద్యఆరోగ్య కమీషనర్ ను కలిశారని ఆయన అభిమానులు తెలిపారు. యాదవ సామాజిక వర్గాన్ని ఏకంచేసి పాలేటి గంగ దగ్గర కాటంరాజు విగ్రహం నెలకొల్పటం బుర్రాకే సాధ్యమైందని కనిగిరి నియోజకవర్గ ములో ఎన్నడు లేనంతగా 42 వేల మెజారిటీ తో గెలిచినా అధిష్టానం దగ్గర అత్యంత సన్నిహితంగా ఉంటూ వరుసగా టీటీడీ పాలకమండలి సభ్యులుగా వైసీపీ జిల్లా అధ్యక్షులుగా ఎస్వీబీసీ ఛానల్ సభ్యులుగా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులుగా నియమితులై సామాజిక సాధికార బస్సు యాత్ర కనిగిరి వచ్చినప్పుడు మునిసిపల్ శాఖామంత్రి ఆదిములపు సురేష్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటగా విజయ్ సాయిరెడ్డి సమక్షంలో బుర్రా మధుసూదన్ యాదవే అభ్యర్థి అని ఆయన ను ఆశీర్వదించాలని బహిరంగ సభలో కోరినప్పటికీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ కు ఇంచార్జ్ గా ప్రకటించక పోవటం ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. అందువల్ల బుర్రా అభిమానులు దద్దాల కు సహకరిస్తారో లేదో అనే చర్చ కొనసాగుతుంది. అన్ని తానై దద్దాల నారాయణ యాదవ్ కు ఇంచార్జ్ పదవి రావడంలో క్రియాశీలక ముగా వ్యవహరించిన రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచేరువు సత్యనారాయణ రెడ్డి ఆ తరువాత దద్దాల వెంట కనిపించకపోవడం ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ చింతలచేరువు ప్రధాన అనుచరగణం దద్దాల వెంట వెన్నుదన్నుగా నడవటం ఊరట కలిగిస్తోందని చర్చ జరుగుతోంది. హేమాహేమీలు ఇంచార్జ్ కోసం పోటీపడినప్పటికి అనూహ్యంగా దూసుకొచ్చిన దద్దాల నారాయణ యాదవ్ ఇంచార్జ్ పదవి దక్కించుకున్నారు సౌమ్యునిగా సేవాతత్పరునిగా పేరున్న వైసీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ తన పని తాను శరవేగంగా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆరు మండలాలలో పర్యటించగా అపూర్వ స్వాగతం లభించింది. యువకుడు ఉత్సాహవంతుడైన దద్దాల విజయం సాధించి కనిగిరి కొండపై వైసీపీ జెండా ఎగురవేస్తారని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కనిగిరి గడ్డ యాదవరాజుల అడ్డా గా మిగిలిపోతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.