వి.ఆర్.పురం
ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ ఇతోధికంగా ప్రజాసేవ చేయడంలో సిపిఎం ఎప్పుడూ ముందే ఉంది అని సిపిఎం జిల్లా సభ్యులు పూనెం సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని శ్రీరామగిరి పంచాయతీలోని చొక్కాన పల్లి గ్రామంలో సిపిఎం బృందం కరపత్రాలు పంచుతూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులను ఎండగడుతూ సిపిఎం చేసిన త్యాగాలను పోరాటాలను ప్రజలకు వివరించారు. ఈసందర్భంగా పూనెమ్ సత్యనారాయణ మాట్లాడుతూ చొక్కానపల్లి గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ 18 సంవత్సరాలు నిండిన యువత యువకులకు కొంతమందికి పడలేదని, ముంపు పేరు చెప్పి గ్రామ అభివృద్ధి జరగట్లేదని, రహదారులు గోతులతో రాళ్లు తేలి వాహనాలు తిరగలేని పరిస్థితి ఉందని, వాటి మీద ఉద్యమాలు పాదయాత్ర చేసిన వాటికి ఫలితం వచ్చిందని, కానీ ప్రభుత్వం ఆచరణలో పెట్టలేదని వారు దుయ్యబట్టారు. కరోనా కష్టకాలంలో చింతూరు కేంద్రలో ఐసోలేషన్ సెంటర్ను నిర్వాహించి ప్రజలకు ధైర్యం చెప్పి అండగా నిలబడింది. పలుచోట్ల వైద్య క్యాంపులను నడిపింది. ఎ.ఎస్.ఆర్ రంపచోడవరం జిల్లాలో అనేక తరగతుల సమస్యల పైన సిపిఎం నిరంతరం పోరాడుతోంది, తమ పెత్తనాన్ని కాపాడుతూ, కోటానుకోట్లు పోగేసుకోడానికి అండగా నిలిచే పార్టీలకు ఆ కోటీశ్వరులు, బడా కార్పొరేట్లు, అండగా ఉంటారు. అందుకు భిన్నంగా సామాన్య ప్రజలకోసం, పేదలకోసం అనునిత్యం ఉద్యమించే సిపిఎం కి అండగా, వెన్నుదన్నుగా నిలిచి భుజం తట్టి ప్రోత్సహించవలసినది ప్రజలే. ప్రజల భాగస్వామ్యంతోనే సీ పీ ఎం నిలబడి పోరాడుతుందని తెలిపారు. అందుకే మీ ముందుకు వస్తున్నాం ఆర్థికంగా మీ శక్తిమేరకు తోడ్పడాలని కోరుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తోడం. రాజు, జి. లక్ష్మణరావు, సిహెచ్. సుబ్బారావు, శాఖ కార్యదర్శి గొంది. దారయ్య, గ్రామ శాఖ సభ్యులు. తోడం. సీతారామయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.