రామచంద్రపురం
చదువులోనే కాదు ఆటపాటల్లో కూడా మేమూ ముందే అంటూ మోడరన్ జి ఆర్ సి జూనియర్ కాలేజీ విద్యార్థులు ఫేర్ వెల్ పార్టీలో సాంస్కృతిక కార్యక్రమలతో అలరించారు.శుక్రవారం విజయ్ ఫంక్షన్ హాల్ లో స్వింగ్ పేరుతో జరిగిన ఫేర్ వెల్ పార్టీ లో మోడరన్ జూనియర్,సీనియర్ ఇంటర్ విద్యార్థులు ప్రదర్శించిన పలు కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసినపి.వీరన్న చౌదరి మాట్లాడుతూ మోడరన్ విద్యాసంస్థల అధినేత లయిన్ జి.వి.రావు తనకు బాల్య స్నేహితుడని, చిన్నతనం నుండే విద్య పట్ల మక్కువ చూపించిన రావు విద్యావేత్తగా విద్యారంగంలో పేరు పొందటం ఆనందదాయకం అన్నారు.అనంతరం మోడరన్ విద్యాసంస్థల అధినేత లయిన్
జి.వి.రావు మాట్లాడుతూ విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఇటువంటి కార్యక్రమాలు చక్కగా తోడ్పడతాయని పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్ సి.హెచ్. రాజేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక నైపుణ్యాలు వెలికితీయడానికి క్రమం తప్పకుండా ఈ కార్యక్రమలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాబోయే పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి మోడరన్ ఘనత మరోసారి చాటాలని ఈసందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి. ఎస్. ప్రకాష్, అకడమిక్ అడ్వైజర్ సి. హెచ్. శ్రీనివాస్, మోడరన్ జూనియర్ కాలేజీ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు.