గండేపల్లి.
గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో జాతీయస్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్ ‘ఆదిత్ – 2K24’ పేరిట ఫిబ్రవరి 23 మరియు 24 తేదీలలో నిర్వహిస్తున్నామని కళాశాల డైరెక్టర్ డా ఎన్ సుగుణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా సంజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఆదిత్ – 2K24 లో ప్రత్యక్షం గా పాల్గొనడం ద్వారా పరిజ్ఞానం ను ఇచ్చి పుచ్చుకోవడానికి ఇది ఉపయోగ పడుతుందని తెలిపారు. అలాగే విద్యార్థులు ఈ ‘ఆదిత్ – 2K24’ లో వివిధ విభాగాలలో ఫైనాన్స్ , మార్కెటింగ్ ,హెచ్ ఆర్. మరియు బిజినెస్ క్విజ్ యంగ్ మేనేజర్, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారికి నగదు బహుమతులతో పాటుగా ప్రశంసా పత్రములను అందిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే విద్యార్థులు దేశ నలుమూలల నుంచి విచ్చేసి పాల్గునతారని వివరిస్తూ, విద్యార్థులాల్ దాగియున్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇటువంటి మేనేజ్మెంట్ ఫెస్టులు ఎంతగానో దోహద పడతాయని తద్వారా భవిష్యత్తులో వారు ఎంచుకున్న మార్గాలను (లక్ష్యాలను) త్వరితగతిన చేరుకోవడానికి ఉపయోగ పడతాయని తెలిపారు.