ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట
జగ్గంపేట మండలంలో ఇర్రిపాక ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద కోటి మట్టి శివలింగాలతో మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్న చోట ఫిబ్రవరి 14వ తేదీన జ్యోతిర్లింగాల ప్రతిష్ట మహోత్సవం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ 11, 12, 13 తేదీలలో అదివాసం(ప్రతిష్టించే జ్యోతిర్లింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించుట) నిర్వహించి దేశంలోని 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను ఆ పీఠాల వద్ద ప్రాణ ప్రతిష్ట చేయించి పవిత్ర నది జలాలతో అభిషేకం చేయించి ఈనెల 14వ తేదీ ప్రతిష్ట మహోత్సవం జరుగుతుందని అన్నారు. ఈ మహా యజ్ఞంలో భక్తులందరూ పాల్గొని పాల్గొని ఆ శివుడి కృపకు పాత్రులు అవుతారని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో కందుల చిట్టిబాబు, తోట రవి, తోట గాంధీ సుంకవిల్లి రాజు, పైడిపాల సత్తిబాబు, సుంకవిల్లి వీర్రాజు, బోండా శీను బాబు, సుంకవిల్లి వీర్రాజు, గొల్లవిల్ల అప్పలరాజు, పడాల విష్ణు, పైలా శివరామకృష్ణ, గద్దె మారుతి, కాపవరపు వెంకటరమణ, పల్లికొండ భద్రం పాల్గొన్నారు.