గండేపల్లి.
స్థానిక గండేపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో నాలుగో విడత ఆసరా కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట వైఎస్ఆర్సిపి ఇన్చార్జి తోట నరసింహం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని 1189 గ్రూపులకు 11,890 అక్క చెల్లెమ్మలకు 8 కోట్ల 83 లక్షల రూపాయలు జంబో చెక్కును ప్రజా ప్రతినిధులు డ్వాక్రా సంఘాల సభ్యులతో కలిసి ఇంచార్జ్ తోట నరసింహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మహిళలకు చేసిన సంక్షేమ పథకాలు మరి ఏ ఏ ప్రభుత్వంలోనూ ఇవ్వడం జరగలేదని, అదేవిధంగా దేశంలోనే ఏ రాష్ట్రంలోని లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ఇంటి వద్దకే ప్రభుత్వ పాలన నేరుగా బటన్ నొక్కి మహిళల ఖాతాల్లోకి ఇవ్వడం జరిగిందని, మరోసారి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ ను దీవించాలని అదేవిధంగా జగ్గంపేటలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తాను పోటీ చేయడం జరుగుతుందని, మహిళలంతా తనను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం మహిళలకు వైయస్సార్ ఆసరా చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి యువ నాయకులు తోటరాంజి, ఎంపీపీ చలగళ్ళ దొరబాబు, రామకుర్తి శ్రీరామచంద్రమూర్తి, కుంచే చినబాబు, ఒబిన్ని వీరబాబు,పరిమి వెంకటేశ్వరరావు, తాళ్లూరి మధు కుమార్, సానిపిని తారకం, తొండపు రమణారెడ్డి, కోర్పు దుర్గాప్రసాద్, ములంపాక సురేష్, మద్దిపట్ల రామకృష్ణ, ఎంపీడీవో ఎన్ హనుమంతరావు, తాసిల్దార్ చిరంజీవి, ఈఓపిఆర్ డి మూర్తి, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,వెలుగు సిబ్బంది, వివో ఏలు,అధిక సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.