రామచంద్రాపురం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీని పిసిసి ఉపాధ్యక్షుడు చింతకుంట వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం రామచంద్రాపురం మండలంలోని
రాయలచెరువు కట్ట సమీపంలో ఉన్న ఓ ప్రయివేట్ కళ్యాణ మండపం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం మహోత్సవం, కార్యకర్తలు సమావేశం జరిగింది ఈసందర్భంగా చిట్టత్తూ గ్రామానికి చెందిన తూకివాకం ఓం ప్రకాష్ రెడ్డి మండల అధ్యక్షుడు గా ప్రమాణ స్వీకారం చేశారు అదే గ్రామానికి చెందిన రతనాల బాలచంద్ర కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి నాయకులు వారధి గా నిలవాలన్నారు ప్రజలు ఓటు హక్కుతో ప్రభుత్వాలను మార్చే శక్తి ఉందన్నారు నియోజకవర్గంలో ఏ మండలంలోనైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే అధికారులను ఎక్కడికక్కడే నిలదీస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకోసం పనిమనిషి లా పనిచేస్తున్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చంద్రగిరి నియోజకవర్గ డాక్టర్ ఇంచార్జి కె వి ఎస్ వాసు మాట్లాడుతూ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొణిదెల రాజేంద్ర, కిరణ్ కుమార్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, సురేష్, ఉషా రెడ్డి, కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు