చంద్రగిరి:
చంద్రగిరి మండలం, ఏ. రంగంపేట పరిధిలోగల మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, డిప్లమా, అగ్రికల్చర్ , పారా మెడికల్ ప్రధమ సంవత్సరములో చేరిన విద్యార్థిని, విద్యార్థులతో ఎం బి యు ఛాన్సలర్ డాక్టర్ మోహన్ బాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ: కృషి ,దీక్ష, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చున్నారు. గురు వే బ్రహ్మ ,గురువే విష్ణు, గురువే మహేశ్వర అని ప్రతి విద్యార్థి భావించాలన్నారు. అప్పుడే జీవితములో పురోభివృద్ధి సాధిస్తారనని తెలిపారు. వచ్చిన ధ్యేయం మరిచిపోకుండా, కన్న తల్లిదండ్రులకు కన్నీరు రాకుండా, చూసుకున్నప్పుడే మీరు మంచి భవిష్యత్తును అందుకుంటారని తెలిపారు. ఎటువంటి ఆకర్షణలకు లోను కాకుండా మనో నిగ్రహంతో విద్యార్థులు, ఈ వయసులో కేవలం చదువు మీదనే శ్రద్ధ చూపించి, ఉన్నత శిఖరాలను అందుకోవాలని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం బి యు వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగరాజ రామారావు, రిజిస్ట్రార్ ఆచార్య కే. సారధి, డీన్లు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.