కంచికచర్ల:కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. నారా భువనేశ్వరి కంచికచర్లకు చేరుకుని.. చంద్రశేఖర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. చంద్రశేఖర్ తల్లి సీతమ్మ, భార్య పల్లవి, కుమార్తెలను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. దేవినేని ఉమాను పరామర్శించారు. భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి గురైన సీతమ్మ, కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు.