ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ పార్లమెంటుకు చేరుకున్నారు. ఆయన ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి అంశాలపై ప్రధానితో జగన్ చర్చించే అవకాశం ఉంది.