ముద్దనూరు
రైల్వే గేటు సమీపంలో ఉన్న వీధిలో తిరుగుతున్న భారీ వాహనాల రాకపోకలు నిలువరించాలని సంబంధిత వీధి లో నివసిస్తున్న ప్రజలు గురువారం సంబంధిత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించు కున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా మైన్స్ సంబంధించిన భారీ వాహనాలు వీధి లో తిరుగుతూ దుమ్ము ధూళితో విధుల నివసిస్తున్న ప్రజలకు అనారోగ్య పరిస్థితులు లోనై అవస్థలు పడే అవకాశం ఉందని అన్నారు. అలాగే చిన్న పిల్లలు విధులలో ఆటలాడుతూ ఉంటారని ప్రమాదాలు జరిగే అవకాశం కూడ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మా వీధిలో నుండి కాకుండా ఇతర మార్గాల నుండి రవాణా చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని వ్యక్తం చేశారు. ఎలాగైనా అధికారులు ప్రజాప్రతినిధులు మైన్స్ యజమాన్యం మా ఆవేదన అర్థం చేసుకుని మరో రహదారి ద్వారా వాహనాల రాకపోకలు జరుపుకోవాలని వారు కోరుతున్నారు.