కడప సిటీ
గురువారం 8 కృషి, పట్టుదల ,తపన ఉన్నత శిఖరాలకు సోపానాలు అని
జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డికడప నగరంలోనిజయనగర్ కాలనీజిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులతోగురువారం సమావేశమై నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులు రేపటి భావితర పౌరులుగా, సమాజ నిర్దేశకులుగా, ఉన్నత స్థానాన్ని అధిరోహించడానికి చదువుతోపాటు సంస్కారం, ఆటలు ,పాటలు, మాటలలో మంచి నైపుణ్యం పొందాలని అన్నారు. అదేవిధంగా రానున్న పబ్లిక్ పరీక్షలలో పరీక్షల ఫోభియాను వదిలిపెట్టి మంచి మార్కుల కోసం ప్రయత్నం చేయాలని విద్యార్థులును ఉద్దేశించి తెలిపారు. అదే విధంగా ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం పెట్టుకుని లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏది లేదని సాధించడానికి వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని అలవర్చుకొని ఉన్నత శిఖరాలనుఅధిరోహించాలనిఆయనపిలుపునిచ్చారు.కుటుంబాలలో పేదరికం పోవాలన్నా ,సమాజ పురోగతి చెందాలన్నా విద్యార్థులకుసమాజంలోగౌరవం ,గుర్తింపు పెరగాలన్న చదువే మార్గమని, చదువుకు మించిన ఆస్తి మరొకటి లేదని, ఆ దిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని విద్యార్థులును ఉద్దేశించి తెలిపారు. అదే విధంగా ప్రతి విద్యార్థి చదివే క్రమంలో వారి పేదరికం, సమాజాన్ని తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి ఉన్నత స్థానం చేరుకోవాలని అన్నారు . ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాగ్యవతి, ఉపాధ్యాయులు రామాంజనేయ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.