పులివెందుల టౌన్
పులివెందుల పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను గురువారం మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి పరిశీలించారు. స్థానిక ముద్దనూరు రోడ్ లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోని పోలింగ్ స్టేషన్ పిఎస్ నెంబర్,72,73లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. బాత్రూంల సమస్య, నీటి సమస్య ఎన్నికల రోజు ఓటర్లకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.