వేంపల్లె
స్థానిక అనాధశ్రమంలోని వృధ్ధులకు అన్నదానం నిర్వహించారు. గురువారం నందిమండలం గ్రామానికి చెందిన డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ డయాన ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా రాజీవ్ నగర్ కాలనీలోని మధర్ థెరిస్సా అనాధ వృద్దాశ్రమంలోని వృధ్ధులకు అన్నదానం, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ వివాహ వార్షికోత్సవాన్ని అనాధవృధ్ధుల మధ్య నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే అనాధ పట్ల శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని, వారికి అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు జయకర్, రాజా, చందు, ప్రసన్న, ప్రదీప్, మణి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.