జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోకవరం రోడ్డు వైపుగా వాహనాల్లో PDS రైస్ తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు 8వ తేదీ తెల్లవారుజామున విజిలెన్స్ మరియు సివిల్ సప్లై అధికారులు స్థానిక పోలీసులతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బావి శెట్టి కనకరాజు అనే వ్యక్తి 54 ప్లాస్టిక్ బస్తాలలో పిడిఎస్ రైస్ ను ఒక వాహనంలో తరలిస్తూ పట్టుబడ్డాడు. అదేవిధంగా జొన్నాడ గ్రామానికి చెందిన నల్లమశెట్టి లక్ష్మణరావు అనే వ్యక్తి 20 కేజీల పిడిఎస్ బియ్యాన్ని గోనేడ నుంచి గోకవరం వైపు తరలిస్తుండగా అతనిని అధికారుల అదుపులోకి తీసుకుని బొలెరో వాహనం పిడిఎఫ్ డిఎన్ఎ స్వాధీనం చేసుకున్నారు. వీరిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్సై ఎం జనార్దన్ రెడ్డి, సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ జిఎం ఎం కృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..