ఏలేశ్వరం:-గ్రామంలో ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ధి సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని మాజీ శాసనసభ్యులు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైకాపా ఇన్చార్జ్ వరుపుల సుబ్బారావు పిలుపునిచ్చారు. గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత 893 సంఘాలకు రు 7.69 కోట్లు విలువ చేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వరుపుల మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి అక్క చెల్లెమ్మలకు అందేలా అధికారులు నాయకులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు అడప పార్థసారథి, తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ ఇసనగిరి ప్రసాదు, కో ఆప్షన్ నెంబర్ పసల నాగేశ్వరరావు, సీనియర్ వైసీపీ నాయకులు వీరంశెట్టి, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితర వైసిపి నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.