జీలుగుమిల్లి
ఇటీవల కిడ్నీ వ్యాధితో బాధపడుతూ విజయవాడలో చికిత్స పొందుతూ
నూప వెంకటరమణ( 56) మృతి చెందారని రాజు మాస్టర్ చెప్పారు. 1991లో ఉద్యోగంలో చేరి వివిధ పాఠశాలలో పనిచేశారు . ఈయన 2019 జనసేన పార్టీలో ఒక హాస్పిరెంట్గా కూడా ఉన్నారు. ప్రస్తుతం జి టి డబ్ల్యూ గర్ల్స్ హై స్కూల్ లంకాలపల్లి బాలికల పాఠశాలలో పనిచేస్తూ డిప్యూటేషన్ పై జి టి డబ్ల్యూ ఏ బాయ్స్ హై స్కూల్ చింతలపూడి లో గత నాలుగు నెలల నుండి పనిచేయుచున్నారు. ఈయన మృతికి సంతాపంగా
ఆదివాసి టీచర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సోదెం రాజు, కోరస రామకృష్ణ , పి పోసి రావు , మరియు టి డబ్ల్యూ టి యు అధ్యక్షులు పాయం పోసి గౌరవ అధ్యక్షులు మొడియం గంగరాజు సీనియర్ ఉపాధ్యాయులు కోర్స రామారావు మరియు లంకాలపల్లి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్న కుమారి , దొర మామిడి ప్రధానోపాధ్యాయులు బెనహర్ మరియు రమణ మాస్టర్ బ్యాచ్ మెంట్స , మండలంలోని వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఘన నివాళులు అర్పించారు.