కామవరపుకోట
గత మూడు రోజులుగా స్థానిక బస్టాండ్ పరిసరాలలో భిక్షాటన చేస్తూ తిరుగుతున్న గుర్తు తెలియని వ్యక్తి బుధవారం రాత్రి మృతి చెందినట్లు తడికలపూడి ఎస్సై జయ బాబు తెలిపారు. కొన ఊపిరితో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి వివరాలను స్థానిక సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు మున్నంగి శ్రీనివాస్, వీరమల్ల మధుల దృష్టికి తీసుకువెళ్లగా సపర్యలు చేసి స్థానిక 108 మరియు ఆసుపత్రి సిబ్బంది సహాయంతో ప్రధమ చికిత్స అనంతరం జంగారెడ్డిగూడెం తరలిస్తుండగా వ్యక్తి మృతి చెందారు. అపస్మారక స్థితిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి పట్ల సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు చూపిన సేవా నిరతిని పలువురు కొనియాడారు. ఆ వ్యక్తి మృతదేహము జంగారెడ్డిగూడెం మార్చురీలో భద్రపరిచినట్లు ఆ వ్యక్తిని గుర్తించి వివరాలు తెలిసినట్లయితే తడికలపూడి పోలీస్ వారిని సంప్రదించవలసిందిగా ఎస్సై జయబాబు 9440796678
తెలిపారు. మృతి చెందిన వ్యక్తి నీలము మరియు పచ్చ గళ్ళు కలిగిన చొక్కా లోపల ఎరుపు రంగు బనియను నల్ల ప్యాంటు ధరించి ఉన్నారని ఎస్ఐ తెలిపారు.