Friday, May 2, 2025

Creating liberating content

తాజా వార్తలుఆకాశమే హద్దుగా సంక్షేమం, అభివృద్ధి

ఆకాశమే హద్దుగా సంక్షేమం, అభివృద్ధి

  • సీఎం జగన్ పాలనకు నిలువెత్తు నిదర్శనం
  • నాలుగున్నరేళ్లలో రూ.కోట్లలో సంక్షేమ నిధులు పంపిణీ
  • ‘నాడు-నేడు’లో పాఠశాలలు, వైద్య కేంద్రాలకు మహర్దశ
  • ఆదర్శనీయం.. ఎమ్మెల్యే చెవిరెడ్డి సేవా సంకల్పం
  • ‘వై ఏపీ నీడ్స్ జగన్ ‘ కార్యక్రమంలో తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
  • రూ.1.36 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం..

రామచంద్రాపురం,

     ఆకాశమే హద్దుగా అభివృద్ధి, సంక్షేమం పథకాల పంపిణీ సీఎం జగన్ పాలనకు నిలువెత్తు నిదర్శనమని తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. అభివృద్ధికి అగ్రతాంబూలం ఇవ్వగా, అన్ని అంశాల్లోనూ ప్రగతికి ఐకాన్ గా నిలిపారని కొనియాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఈ ప్రగతి సాధ్యమైందని స్పష్టం చేశారు. బుధవారం రామచంద్రాపురం మండలంలో ‘వై ఏపీ నీడ్స్ జగన్ ‘ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే జగనే కావాలంటూ ప్రజలు గొంతెత్తి చాటారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధుల జాబితా బోర్డ్ ను ఆవిష్కరించారు. దివంగత మహా నేత విగ్రహానికి నివాళులు అర్పించారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆధ్వర్యంలో వేడుకగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. జై జగన్ నినాదంతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు. మండలంలో కెకెవి పురం, సొరకాయల పాలెం, నెన్నూరు, నడవలూరు,
సి.రామాపురం పంచాయతీలలో మోహిత్ రెడ్డి పర్యటనతో పండుగ వాతావరణం నెలకొంది.

ఇంటి స్థలాలపై హక్కు.. సీఎం ఘనత

దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం పంపిణీ చేసిన ఇంటి స్థలాలపై హక్కు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకర జీవితాన్ని అనుభవించేందుకు మెరుగైన వైద్య వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పరితపించే సీఎం జగన్ ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో రూ.కోట్లలో సంక్షేమ నిధులు పంపిణీ చేశారన్నారు. ‘నాడు-నేడు’లో పాఠశాలలు, వైద్య కేంద్రాలకు మహర్దశ పట్టిందన్నారు. ప్రతి కుటుంబానికి నిజంగా లబ్ధి చేకూరిందని భావిస్తేనే మీ ఓటుతో ఆదరించమని కోరే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. అవినీతి రహిత పాలన, సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి ఒక్క వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి సగటున రూ.3 లక్షల వరకు లబ్ధి చేకూరిందన్నారు. అమ్మ ఒడి, చేయూత, రైతు భరోసా తదితర పథకాలు ప్రతి గడపకు చేరాయని వెల్లడించారు. ప్రతి నిరుపేద ఆర్థిక ధైర్యంతో జీవితాన్ని గడుపుతున్నారు.. అన్ని రంగాల్లో రాణిస్తున్నారని వివరించారు. పురిటి బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్ ఆడుకున్నారని తెలిపారు. గతంలో ఉన్న రైతుల ఆత్మహత్యలను నేడు అధిగమించామని తెలియజేశారు. ఏపీ కి జగన్ ఎందుకు కావాలనే అంశంపై ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఎమ్మెల్యే అంటే..

  రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సేవకు సంకల్పించడమే ఎమ్మెల్యే విధి.. కానీ చంద్రగిరి నియోజకవర్గంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలే కుటుంబ సభ్యులుగా భావించి సేవకు ఉపక్రమిస్తూ సరికొత్త నిర్వచనానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆదర్శనీయంగా నిలిచారన్నారు. కరోనా కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేసిన సందర్భాన్ని ప్రస్తావించారు. వరదల సమయంలో రాయల చెరువు కట్టకు గండి పడ్డ సమయంలో ఆయన సాహసం చేశారన్నారు. లక్ష మూటల ఇసుకను యుద్ద ప్రాతిపాదికన కట్ట బలోపేతానికి చేసిన కృషిని కొనియాడారు. ప్రతి కుటుంబానికి వ్యక్తిగత సాయం చేస్తూ వారికి పెద్ద కొడుకుగా నిలుస్తున్నారని తెలిపారు. ఆయన తనయుడిగా, మీ ఇంటి బిడ్డగా నన్ను 2024 ఎన్నికల్లో ఆదరించండి.. రెట్టింపు ప్రజా సేవకు, అభివృద్ధి చేసి చూపుతానని తెలిపారు. మండలంలోని పంచాయతీల మరింత అభివృద్ధి నా బాధ్యత అని హామీ ఇచ్చారు.

ప్రారంభోత్సవాలు..

మండలంలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తశుద్దితో చేపట్టారన్నారు. అందులో భాగంగా రావిళ్ళవారి పల్లిలో రూ.7 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను, దేసూరి కండ్రిగలో రూ.8 లక్షలతో నిర్మించిన అంగన్ వాడీ కేంద్రం భవనం, కమ్మపల్లిలో రూ.14 లక్షలతో నిర్మించిన స్వయం సహాయక సంఘ మహిళా భవనం, దేసూరి కండ్రిగలో రూ.7 లక్షలతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్, రూ.8 లక్షలతో నిర్మించిన అంగన్ వాడీ కేంద్ర భవనం, పాత కందుల వారి పల్లిలో రూ.23.94 లక్షలతో రైతు భరోసా కేంద్రం, రూ.14 లక్షలతో మహిళా స్వయం సహాయక సంఘ భవనం, రూ.25 లక్షలతో నిర్మించిన ఆరోగ్య కేంద్రం, నెన్నూరులో రూ.14 లక్షల తో మహిళా భవనం, రూ.16 లక్షలతో నిర్మించిన వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ ని తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రారంభించారు.

పంచాయతీల్లో..

  • కెకెవి పురం పంచాయతీలో అభివృద్ధి పనులు రూ.3.39 కోట్లతో చేపట్టగా, రూ.15.49 కోట్ల సంక్షేమ నిధులను 3,242 మందికి పంపిణీ చేశామన్నారు. వెంకటరామాపురం పంచాయతీలో రూ.97 లక్షలతో, రావిళ్ళవారి పల్లె పంచాయతీలో రూ.1.83 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
  • సొరకాయల పాలెం పంచాయతీలో రూ. 2.74 కోట్లు, దేసూరి కండ్రిగలో రూ.3.05 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా, రూ.18.60 కోట్ల సంక్షేమ నిధులు అందజేశామన్నారు.
  • నెన్నూరు పంచాయతీ పరిధిలో రూ.6.17 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రహదారుల ఆధునీకరణతో రవాణా వ్యవస్థ మెరుగుపడిందన్నారు. పాత కందుల వారి పల్లిలో రూ.1.69 కోట్లు, గణేశ్వరపురం పరిధిలో రూ.2.93 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా, రూ.19.49 కోట్ల సంక్షేమ నిధులు ప్రజలకు పంపిణీ చేశామన్నారు.
  • నడవలూరు పంచాయతీ పరిధిలో రూ.4.27 కోట్లు, కమ్మ కండ్రిగలో రూ.2.61 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా రూ.23.48 కోట్ల సంక్షేమ నిధులు 4,974 మందికి పంపిణీ చేశామన్నారు.
  • సి.రామాపురం పంచాయతీ పరిధిలో రూ.10.11 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా, అత్యధికంగా సీసీ రోడ్లకు నిధులు కేటాయించామన్నారు. అత్యధికంగా రూ. 23.94 కోట్ల సంక్షేమ నిధులు లబ్ధిదారులకు అందించామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానంద రెడ్డి, జెడ్పీటీసీ ఢిల్లీ భానుకుమార్ రెడ్డి, మాజీ ఎంపీపీ దామోదర్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాబు యాదవ్, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article