పులివెందుల
అన్ని వసతులతో ప్రజలకు, రైతులకు రైతు బజార్ ఈనెల 15వ తేదీ నుండి అందుబాటులోకి రానుంద ని మార్కెట్ యార్డ్ చైర్మన్ గోటూరు చిన్నప్ప, వైస్ చైర్మన్ సర్వోత్తమ్ రెడ్డి లు తెలిపారు మధ్యవర్తిత్వం లేకుండా ప్రజలకు,రైతులకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ యార్డ్ ఆవరణలో కోటి రూపాయ ల వ్యయంతో రైతు బజార్ ను నిర్మించడం జరిగింద న్నారు ఈ రైతు బజార్ ను ఇటీవల ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు ఆకుకూరలు, కూరగాయలు పండించే రైతులు నేరుగా రైతు బజార్లో విక్రయిం చవచ్చన్నారు దీంతో ప్రజలకు తాజా ఆకుకూరలు, కూరగాయలు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తాయని వారు తెలిపారు అలాగే రైతులు పండించిన పంటలకు మధ్యవర్తితం లేకపోవడంతో మరింత లాభం రైతులకు అందుతుందన్నారు ఆకుకూరలు విక్రయించేందుకు 16 స్టాల్స్, కూరగా యలు విక్రయించేందుకు 28 స్టాల్స్, నిత్యవసర సరుకులు విక్రయించేందుకు పది స్టాల్స్ అందుబా టులో ఉన్నాయన్నారు.మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యం లో రైతు బజార్లో అమ్మకాలు ప్రారంభమయ్యేలా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు అలాగే మార్కెట్ యార్డులో ఉన్న రైతు బజార్లో నిరంతరం భద్రతా పర్యవేక్షణ, త్రాగునీరు, వాహనాల పార్కింగ్కు అనువైన స్థలం,మరుగుదొడ్ల సౌకర్యం ఇతర అన్ని వసతులతో రైతు బజార్ ప్రజలకు అందుబాటులోకి రానుందని వారు తెలిపారు ఈ అవకాశాన్ని పులివెందుల ప్రాంత ప్రజలు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవా లని వారు కోరారు.