Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుకోటిరెడ్డి కళాశాల ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంప్ ముగింపు కార్యక్రమం

కోటిరెడ్డి కళాశాల ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంప్ ముగింపు కార్యక్రమం

కడప అర్బన్

రామన పల్లె గ్రామంలో కోటి రెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జాతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడు రోజుల స్పెషల్ క్యాంపు ముగింపు కార్యక్రమం బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించి ప్రత్యేక శిబిరంలో పాల్గొన్న వాలంటీర్లందరికీ సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. సలీం భాషా తెలియజేశారు. ప్రత్యేక శిబిరంలోని ఏడవ రోజు ఓటు నమోదు అంశంపై కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వయోజనులైన ప్రజలందరూ ఓటు హక్కును కలిగి ఉండాలని, తమ ఓటును నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు కలిగిన వారంతా ఎన్నికలలో తమ ఓటు హక్కును ఉపయోగించి సరైన నాయకులను ఎన్నుకోవాలని, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం లాంటిదని కావున ప్రజలంతా తమ ఓటును నమోదు చేసుకొని ఉపయోగించుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ ఓటు నమోదు అవగాహన కార్యక్రమం అనంతరము గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ప్రత్యేక శిబిరం యొక్క ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.ఈ ముగింపు కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షత వహించారు. కృషి విజ్ఞాన కేంద్రం నుండి ప్రముఖ శాస్త్రవేత్త ,అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ప్రశాంతి అతిధిగా విచ్చేసి వాలంటీర్లకు సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతతో పాటు సమాజ సేవలో పాలుపంచుకోవడం చాలా గొప్ప విషయం అని, సేవ ద్వారా మాత్రమే మనిషికి నిజమైన ఆనందం లభిస్తుందని ఇలాంటి అవకాశం ఎన్ ఎస్ ఎస్ ద్వారా రావడం విద్యార్థులకు ఒక గొప్ప అవకాశమన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలైన ఉమామహేశ్వరి ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు వారి భవిష్యత్తు యొక్క దిశా నిర్దేశం చేశారు. కోటి రెడ్డి కళాశాల ఎన్ ఎస్ ఎస్ సేవలు అందించడానికి రామణపల్లి గ్రామాన్ని ఎంచుకోవడం, అందులో భాగంగా తమ పాఠశాలను సందర్శించడం తమకు నిజమైన ఆనందమని, తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు కూడా ఈ కళాశాల జాతీయ సేవా సమితి ద్వారా సేవా గుణము అలవర్చుకోవడానికి ఒక మంచి అవకాశమని తెలియజేశారు. ఈ ముగింపు కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి. విజయలక్ష్మి దేవి, డాక్టర్ గురు మోహన్ రెడ్డి, గ్రామ పెద్దలు రఘునాథ రెడ్డి, స్వరూపా రాణి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article