ఏలూరు.
ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో ఈ నెల 5వ తేదీన జరిగిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సభ కవర్ చేసేందుకు వెళ్లిన
సీనియర్ జర్నలిస్టులు కెయస్. శంకర్రావు, రమణ రావుల సెల్ఫోన్లను లాక్కొని వారిపై దురుసుగా ప్రవర్తించిన దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపియుడబ్లుజే నాయకులు బుధవారం ఏలూరు రేంజ్ ఐజి జివిజి.అశోక్ కుమార్ ని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. తదుపరి డిజిపి జరిగిన విషయంపై సవివరంగా తెలియజేయమగా యూనియన్ నాయకులు
జర్నలిస్టులు తమ విధులు తాము నిర్వహిస్తున్నామని చెప్పినప్పటికీ వినకుండా వారి సెల్ ఫోన్ లను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లాక్కుని ద్వంసం చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా వారిపై దురుసుగా ప్రవర్తించి జర్నలిస్టులు అయితే మాకేంటి మీకు చేతనైనది మీరు చేసుకోండి అంటూ తన ఆగ్రహాన్ని ప్రదర్శించడం సమంజసం కాదనీ. ఇప్పటికే
దెందులూరు నియోజకవర్గంలో తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎదుర్కోంటున్న మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ జర్నలిస్టులతోనూ అదే తీరుతో వ్యవహరించడం సరికాదని అందువల్ల ఆయనపై చట్ట పరంగా చర్యలు తీసుకుని జర్నలిస్ట్ ల సెల్ ఫోన్ లను వారికి అందించేలా చూడాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఐజి అశోక్ కుమార్ ని కోరారు. ఐజిని కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ కు సంబంధించిన పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.