బుట్టాయగూడెం.
మండలంలోని నక్క వారి కుంటకు చెందిన గిరిజనులు భారీ సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో చేరారు. నక్క వారి కుంట గ్రామంలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో బిజెపి కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ మాట్లాడుతూ ధర్మ పరిరక్షణ, సంస్కృతి రక్షణ కొరకు నక్క వారి కుంట గ్రామం నుంచి భారీగా భారతీయ జనతా పార్టీలో చేరికలు జరగడం అత్యంత శుభ సూచకం అన్నారు. నరేంద్ర మోడీ ఈ దేశానికి చేస్తున్న సేవలను కొనియాడారు. నరేంద్ర మోడీ పరిపాలనలో గిరిజనులు మరియు కొండరెడ్డి ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. గ్రామస్తులందరూ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు దొమ్మేటి లక్ష్మీ జనార్ధన రావు, మండల ప్రధాన కార్యదర్శులు దయ్యాల సీతారామాంజనేయులు, సోము హరి నారాయణ, గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి దర్ముల వెంకటేశ్వరరావు పాల్గొని నక్క వారి కుంట గ్రామస్తులను సాదరంగా భారతీయ జనతా పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు .