స్ట్రాంగ్ రూమ్, ఈవిఎంలను భద్ర పరిచేందుకు భవనాలను పరిశీలించిన కలెక్టర్
హిందూపురం టౌన్
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని శ్రీసత్య సాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం స్ట్రాంగ్ రూమ్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రపరిచేందుకు అవసరమైన భవన సముదాయాలను కలెక్టర్ జెసి సబ్ కలెక్టర్ల లతో కలిసి పరిశీలించారు. ఇందులో భాగంగా పట్టణంలోని హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి
ఎంజీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల లో పలు భవనాలను పరిశీలించారు . హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి స్ట్రాంగ్ రూం రిసెప్షన్ సెంటర్,
ఇవిఎంలను భద్రపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. అనంతరం రెవిన్యూ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయా కేంద్రాల్లోని భవనాలు, వసతులు, త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను పరిశీలించడంతోపాటు, రహదారి సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, శ్రీకాంత్ రెడ్డి తహసిల్దార్, శివ ప్రసాద్ రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.