తాజా వార్తలుఆలయ నిర్వహణపై కమిటీ సభ్యుల సమావేశం

ఆలయ నిర్వహణపై కమిటీ సభ్యుల సమావేశం

లేపాక్షి :

ప్రపంచ పర్యాటక చిత్రపటంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన లేపాక్షి వీరభద్రాలయ నిర్వహణపై వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, ఆలయ కార్య నిర్వహణాధికారి, ఆలయ అర్చకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ స్థితిగతులపై చర్చించారు. ఆలయ అర్చకులు సిబ్బంది జీత , భత్యాలపై అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా దేవాదాయ శాఖ ఆలయ పాలన విధానాలపై ఆలయ కార్య నిర్వహణ అధికారి ని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా శివరాత్రి దసరా ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఏ విధంగా నిర్వహిస్తున్నారన్న విషయంపై చర్చించారు. గతంలో లాగానే గ్రామ పెద్దలు, లేపాక్షి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కలసి శివరాత్రి, దసరా ఉత్సవాలు నిర్వహిద్దామని చైర్మన్ రామానందన్ పేర్కొన్నారు. లేపాక్షి ఆలయ అభివృద్ధి విషయంపై ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి ఆర్కే రోజా లతో చర్చించడం జరిగిందన్నారు. అదేవిధంగా లేపాక్షి ఉత్సవాల నిర్వహణపై కూడా చర్చించానన్నారు. ఆలయ అభివృద్ధి కోసం సంబంధిత శాఖలతో సమన్వయ పరుచుకుని ముందుకెళదామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పరమానంద పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article