పులివెందుల
కడపలోని డాక్టర్ వైయస్సార్ స్పోర్ట్స్ పాఠశాలలో జనవరి 31న జరిగిన హాకీ సెలక్షన్ లో ఎంపికైన క్రీడాకారులకు కోచింగ్ క్యాంపు ప్రారంభమైనట్లు కడప జిల్లా హాకీ సెక్రెటరీ శేఖర్ తెలిపారు. సెలక్షన్స్ కు బాలికలు 25, బాలురు 49 మంది క్రీడాకారులు హాజరయ్యారని,ప్రతిభను కనబరిచిన 25 మంది క్రీడాకారులను బాలురకు పులివెందుల పట్టణంలో కోచింగ్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.అందు లోని తుది నిర్ణయ జట్టు ఫిబ్రవరి 10 తేదీ నుండి 12వ తేదీ వరకు జరగబోవు చాంపియన్షిప్ లో పాల్గొంటారని ఆయన తెలిపారు అలాగే బాలికల జిల్లా జట్టు ఫిబ్రవరి 9 తేదీ నుండి 11 తేదీ వరకు హాకీ ఏపీ ఉమెన్స్ జూనియర్ ఛాంపియన్ షిప్ పాల్గొంటారని జిల్లా సెక్రెటరీ శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాసులు, శాప్ కోచ్ రమేష్ బాబు, సీనియర్ పిఈటిస్ సునీల్, ప్రభాకర్, విక్టర్,సీనియర్ కోచ్ ఖాదర్ , అనిల్ ,శౌరి పాల్గొన్నారు.