ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా అవగాహన ర్యాలి
పులివెందుల
యస్.పి సిద్దార్థ్ కౌశల్ ఆదేశాలపై పులివెందుల డి.యస్.పి వినోద్ కుమార్ ఉత్తర్వుల మేరకు, 35వ జాతీయ రోడ్డుభద్రతా వారోత్సవాల్లో భాగముగా శుక్రవారం ద్విచక్ర వాహనాల ర్యాలీని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మెన్ డా.వల్లెపు వరప్రసాద్, అర్బన్ యస్.ఐ హుస్సేన్ పాల్గొని ద్విచక్ర వాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. బైకు రైడర్లతో కలసి పులివెందులటౌన్ లోని కోర్ట్ సర్కిల్ నుండి పూలఅంగళ్ళ సర్కిల్ వరకు బైకుర్యాలీ నిర్వహిం చి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సంధర్భం గా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు తప్పని సరిగా హెల్మెంట్ ధరించాలన్నారు. హెల్మెట్ ధరించక పోవడమువలన, కారు డ్రైవర్లు షీట్ బెల్ట్ పెట్టుకోక పోవడమువల్ల రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతము ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నార ని గుర్తు చేశారు.దేశములో ప్రతిరోజు 28 మంది చొప్పున రోడ్డు ప్రమాదములో హెల్మెంట్ వాడక పోవడమువలనే ప్రాణాన్ని కోల్పోతున్నారని అన్నారు. కావున ప్రతిఒక ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రయాణించాలన్నారు.త్రిబుల్ రైడింగ్, పరిమితికి మించి వాహనాలు నడుపుట, మధ్యము సేవించి వాహనాలు నడుపుట వంటి చట్ట వ్యతిరేక పనులకు దూరముగా ఉండవలెనని సూచించారు.ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా వారిలో చైతన్యము నింపుటకు ద్విచక్రర్యాలీ కార్యక్రమము చేపట్టడం జరిగిందన్నారు. రూల్స్ కు అతిక్రమించి వెళితే జరిమానా తప్పదన్నారు.ఈ ర్యాలీలో జే సి ఎస్ ఇంచార్జ్ కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్, పోలీసలు తదితరులు పాల్గొన్నారు.