మండల కేంద్రంలో భారీ ర్యాలీ -తరలివచ్చిన వెలిగండ్ల మండల వైసీపీ శ్రేణులు
కనిగిరి
కనిగిరి వైసీపీ నూతన ఇంచార్జ్ గా ఎన్నికైన దద్దాల
నారాయణ యాదవ్ ఆత్మీయ పరిచయ కార్యక్రమాన్ని వెలిగండ్ల మండల కేంద్రంలో అట్టహాసంగా నిర్వహించారు జడ్పిటిసిల సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటక తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పిటిసి రమణ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో వెలిగండ్ల మండలంలోని వైసీపీ శ్రేణులు వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ కు ఘన స్వాగతం పలికారు ముందుగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించి అనంతరం ర్యాలీగా సభ ప్రాంగణానికి చేరుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జడ్పిటిసిల సంఘం జిల్లా అధ్యక్షులు గుంటక తిరుపతిరెడ్డి మాట్లాడుతూ యువకులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ఎమ్మెల్యేలుగా ఎక్కువమంది యువతను ముందుకు తీసుకురావడం జరిగిందని అందులో భాగంగా యువకుడు విద్యావంతుడైన వెలిగండ్ల మండల వాసి అయిన దద్దాల నారాయణ యాదవ్ కు కనిగిరి ఇన్చార్జిగా అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు పి డి సి సి బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో సంక్షేమ పథకం అందితేనే మీరు నన్ను ఆశీర్వదించండి అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప మరెవ్వరూ లేరని అన్నారు సింగిల్ విండో చైర్మన్ కాకర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కనిగిరి మండలంలో అత్యధిక మెజారిటీతో అభ్యర్థి గెలుపుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరారు సీనియర్ నాయకులు మాజీ జడ్పిటిసి రామన్న తిరుపతిరెడ్డి మాట్లాడుతూ వెలిగండ్ల మండల ప్రాంత వాసి అయిన గెలుపు కోసం అందరం కృషి చేయాలని కోరారు మండల సీనియర్ నాయకులు కటికల వెంకటరత్నం మాట్లాడుతూ వెలిగండ్ల మండలం పెరుగుపల్లి నివాసి అయిన దద్దాల నారాయణ యాదవ్ నిరంతరం ప్రజాసేవకు పరితపించే వ్యక్తిని అన్నారు వారి సేవలను గుర్తించి యూనివర్సిటీ వారికి డాక్టర్ తో సన్మానించడం జరిగిందని అన్నారు వలసల నివారణ జరగాలని యువతకు ఉద్యోగ అవకాశ కల్పన కోసం విచ్చేయాలంటే దద్దాల నారాయణ యాదవ్ కి వైసీపీ శ్రేణులు అందరూ సహకరించి వైసిపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు వైసిపి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ జగనన్న ఆదేశాలనుసారంగా అభ్యర్థి గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు అనంతరం వైసీపీ నూతన ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ముందుకు సాగుతుందని యువకుడినైన తనను గుర్తించి కనిగిరి ఇన్చార్జిగా అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి కి అలానే ఒంగోలు టైగర్ బాలినేని శ్రీనివాసరెడ్డి కి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు ప్రకాశం జిల్లా జీవధారణ అయిన వెలుగొండ ప్రాజెక్ట్ రెండవ టన్నుల్ అతి త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరుగుతుందని తద్వారా వెనుకబడిన ప్రాంతమైన కనిగిరి సస్యశ్యామలంగా మారబోతుందని అన్నారు వెలిగండ్ల మండలం నుండి పాపిరెడ్డి అనంతరం ముక్కు కాశిరెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారని అనంతరం నేడు తనకు అవకాశం వచ్చిందని మండల ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వెలిగండ్ల మండల పార్టీ అధ్యక్షులు గజ్జల వెంకటరెడ్డి, ఎంపీపీలు రమణ లక్ష్మీకాంతం తిరుపతిరెడ్డి, దంతులూరి ప్రకాశం, జడ్పిటిసిల సంఘం జిల్లా అధ్యక్షులు గుంటక తిరుపతిరెడ్డి, కనిగిరి జెడ్పిటిసి మడతల కస్తూరి రెడ్డి పిడిసిసి బ్యాంకు చైర్మన్ వై ఎమ్ ప్రసాద్ రెడ్డి వెలిగండ్ల సర్పంచ్ సురేష్, సీనియర్ నాయకులు కటికల వెంకటరత్నం, వెలిగండ్ల సింగిల్ విండో చైర్మన్ కాకర్ల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, వైసిపి నాయకులు శ్రీహరి రెడ్డి, దాదిరెడ్డి మాలకొండ రెడ్డి, వైస్ ఎంపీపీ నాగూర్ యాదవ్, వైస్ ఎంపీపీ పుష్ప దేవసహాయం, గంజి వెంకటరెడ్డి, అంకిరెడ్డి, వైసిపి నాయకులు గోవర్ధన్ రెడ్డి, మండలం పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు గృహ సారధులు సచివాలయాల కన్వీనర్లు వైసిపి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.