మండలపరిదిలో 84 కేజీలు ఉచితంగా మందు పంపిణీ
కాజులూరు
రైతులంతా తమ పోలాల్లో ఒకేసారి ఎలుకల నివారణకు మందు వాడితే మరింత ఆదాయం చేకూరుతుందని మండల వ్యవసాయ అదికారి వి.అశోక్ అన్నారు .ఈమేరకు శుక్రవారం
కాజులురు మండలం పరిధి లోగల 23 రైతు భరోసా కేంద్రాల్లో సామూహిక ఎలుకల నివారణ కొరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా రైతులకు ఎలుకల నివాణపై పలు చూచనలు చేసారు. అనంతరం.మండలపరిదిలో రైతులందరికీ 84కేజీల బ్రోమాడయోలోన్ ఎలుకల మందుని ఉచితంగా అందజేశారు.ఈసందర్భంగా శీల గ్రామం నందు మండల వ్యవసాయ అధికారి .వి అశోక్
పాల్గొని రైతులకు ఎర తయారీ విధానం తోపాటు మందు విషయంలో రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేశారు.