గొల్లప్రోలు
గొల్లప్రోలు నగర పంచాయతీ నూతన కమిషనర్ గా టి. రవికుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు.ఇప్పటి వరకు కమిషనర్ గా పనిచేసిన మోర్కుర్తి సత్యనారాయణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ అయిన విషయం తెలిసిందే.సత్యనారాయణ స్థానంలో గొల్లప్రోలు కమీషనర్ గా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ కార్యాలయంలో సెక్రటరీగా పనిచేస్తున్న రవికుమార్ ను నియమించారు.ఈ నేపథ్యంలో రవికుమార్ గొల్లప్రోలు కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రవికుమార్ ను నగర పంచాయతీ మేనేజర్ రాంప్రసాద్,జేఈఓ పద్మజ్యోతి, ఆర్ఐ కెపిపి వదన్ సీనియర్ అసిస్టెంట్ ఈశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ కార్యాలయం సిబ్బంది అభినందనలు తెలిపారు.